Samantha: 100 కిలోల బరువును అవలీలగా ఎత్తిపారేసిన సమంత.. షాక్‌ అవుతున్న నెటిజన్లు

Samantha Latest Heavy Weight  Gym Workout
  • ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత
  • జిమ్‌లో వ్యాయామం 
  • నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు 
సినీనటి సమంత 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తి పారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంది. గతంలోనూ ఈ అమ్మడు ఇలా బరువైన బార్బెల్స్‌ ఎత్తుతూ పలుసార్లు వీడియో తీసుకుంది.

జిమ్‌లో కోచ్‌ సాయంతో ఆమె వ్యాయామం చేస్తుంటుంది. తాజాగా, ఆమె జిమ్‌లో 100 కిలోల బరువును ఎత్తిన విషయంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'వామ్మో సమంతా' అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇంత బరువు ఎలా ఎత్తావని ప్రశ్నిస్తున్నారు. 'ఏ మాయ చేశావే' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమంత దక్షిణాది టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. ఇటీవలే ఆమె నటించిన జాను సినిమా విడుదలైంది.  
Samantha
Tollywood
Twitter
Viral Videos

More Telugu News