Samantha: నయనతార సినిమా నుంచి తప్పుకున్న సమంత?

  • విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ మూవీ
  • ఒక కథానాయికగా నయనతార
  • కోలీవుడ్లో షికారు చేస్తున్న వార్త
Samantha out from Vighnesh Shivan Movie

తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు మంచి క్రేజ్ వుంది. ఇటీవల ఆమె తమిళంలో ఒక సినిమాను అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి కథానాయకుడిగా విఘ్నేశ్ శివన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే.

ఒక కథానాయికగా నయనతార ఖరారైపోయింది. మరో కథానాయిక పాత్రకి సమంత అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని విఘ్నేశ్ శివన్ కి నయనతార చెప్పిందట. నయనతార రిక్వెస్ట్ మేరకే సమంత ఆ ప్రాజెక్టును అంగీకరించిందని కూడా చెప్పుకున్నారు. ఒకే తెరపై నయనతార - సమంతలను చూడాలని ముచ్చటపడిన అభిమానులు ఆనందపడిపోయారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుందనేది తాజా సమాచారం. అందుకు గల కారణం ఏమై ఉంటుందనేది తెలియాల్సి వుంది.

More Telugu News