కుమార్తె ఫోన్ లో మాట్లాడుతుండటాన్ని చూసి... నడిరోడ్డుపైకి లాక్కొచ్చి గుండు కొట్టించిన తండ్రి!

01-03-2020 Sun 12:49 | National
  • మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ సమీపంలో ఘటన
  • మరో యువకుడితో ఫోన్ లో మాట్లాడుతుంటే చూసిన తల్లిదండ్రులు
  • దయారహితంగా హింసించిన వైనంపై పోలీసు కేసు
తన కుమార్తె ఎవరితోనో మాట్లాడుతూ ఉందన్న ఆగ్రహం ఆ తండ్రి వివేకాన్ని కోల్పోయేలా చేసింది. ఆమెను దారుణంగా కొట్టడంతో పాటు నడి వీధిలోకి లాక్కొచ్చి, హింసించి, ఆమెకు గుండు గీయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ సమీపంలో జరుగగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే, ఓ మైనర్ బాలిక, తనకు తెలిసిన యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న బిడ్డని, అసలు ఏమైందో తెలుసుకోవాలని కూడా ఆలోచించకుండా, తప్పు చేస్తున్నావంటూ, ఆమెను హింసించారు. విపరీతంగా కొట్టి, నడిరోడ్డుపైకి లాక్కొచ్చారు.

ఇకపై ఆ అబ్బాయితో మాట్లాడనని, తనను క్షమించాలని ఆమె వేడుకుంది. అయినా కనికరం లేకుండా నలుగురూ చూస్తుండగా, గుండు కొట్టించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. వీడియోను చూసి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
Madhya PradeshGirlPhoneHerasment

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more