Nara Lokesh: ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి జగన్ చావు దెబ్బ కొట్టారు: నారా లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటనకు వైసీపీ ఆటంకాలు కలిగిస్తోన్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. '9 నెలల నుండి తుగ్లక్ సమేత వైకాపా పరివారం "గో బ్యాక్" అంటూనే ఉన్నారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జీఎన్ రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను "గో బ్యాక్" అని తరిమేశారు' అని విమర్శించారు.
 
'హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి  ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ గారు ఇచ్చాను అంటున్న రూ.50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం?' అని నిలదీశారు.

'దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన జగన్ గారిని "గో బ్యాక్" అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది' అని విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News