ట్రంప్, మెలానియా సబర్మతి ఆశ్రమంలో ఏమీ తినలేదు: ఆశ్రమ ట్రస్టీ
- సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్
- ట్రంప్ కోసం అనేక వంటకాలు సిద్ధం చేసిన ఆశ్రమ వర్గాలు
- ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి వెళ్లిన ట్రంప్
గుజరాతీ ఫేమస్ ఖమాన్, బ్రోకోలి కార్న్ సమోసా, ఆపిల్ పై, కాజు కత్లి, అనేక రకాలు టీలు తయారు చేశారు. అయితే, ఆ వంటకాలను ట్రంప్ కానీ, ఆయన భార్య మెలానియా కానీ ఎవరూ స్వీకరించలేదని సబర్మతి ఆశ్రమ ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ వెల్లడించారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన వెంటనే ట్రంప్ తదితరులు నమస్తే ట్రంప్ కార్యక్రమం కోసం మొతేరా స్టేడియానికి తరలి వెళ్లారు.