ట్రంప్ ఎఫెక్ట్: మురికివాడల వాసులను ఖాళీచేసి పొమ్మంటూ నోటీసులు !
- ఈ నెల 24న మొతేరాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్
- మురికివాడలోని కుటుంబాలు కనిపించకుండా గోడ కట్టిన అధికారులు
- ఖాళీ చేయాలంటూ 45 కుటుంబాలకు నోటీసులు
గోడ కట్టడంతో సరిపెట్టని అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ తాజాగా ఆ కుటుంబాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. తాము దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నామని, ఇప్పటికిప్పుడు తమను ఖాళీచేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు ఆ నోటీసులకు, ట్రంప్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.