Budda Venkanna: విజయసాయిరెడ్డి గారూ, అవినీతి సామ్రాజ్యం తాళాలు మీకు అప్పగించి జగన్ అడ్డంగా దొరికిపోయారు: బుద్ధా వెంకన్న

ఏపీలో ఐటీ దాడుల పర్యవసానంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. "వ్యవస్థలను బ్రష్టుపట్టించి, చట్టాలను అపహాస్యం చేసి, మాయ లెక్కలతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ తాళాలు మీకు అప్పగించి అడ్డంగా దొరికిపోయారు. జైలు గురించి, జైలుకు వెళ్లడం గురించి మీరు మాట్లాడడం కాదు, మీ అనుభవాలతో పుస్తకాలు రాయండి విజయసాయిరెడ్డి గారూ! ఆ పుస్తకానికి 'ఇంత బతుకు బతికి జైల్లో...' అనే పేరుపెట్టండి!" అంటూ ఎద్దేవా చేశారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Jagan
IT Raids
Telugudesam
YSRCP

More Telugu News