Tahasildar: తహసీల్దార్ వనజాక్షిని అడ్డుకున్న ప్రజలు... పోలీసుల సాయంతో వెనుదిరిగిన వైనం
విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో వ్యవసాయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన తహసీల్దార్ వనజాక్షికి ప్రజాగ్రహం ఎదురైంది. తమ భూములను తీసుకోవడానికి వీల్లేదని కొత్తూరు ప్రజలు తహసీల్దార్ తో వాగ్యుద్ధానికి దిగారు. ఓ దశలో తహసీల్దార్ వనజాక్షి సహనం కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆమె రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో రైతులు కూడా తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి పోలీసుల సాయంతో వనజాక్షి అక్కడి నుంచి నిష్క్రమించారు.