శివోహం... శివోహం... మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు!
- శ్రీశైలంలో 24 వరకూ ఆర్జిత సేవలు రద్దు
- శివ స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం
- కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
ఇక శ్రీకాళహస్తి, భీమవరం, విజయవాడ ఇంద్రకీలాద్రి తదితర క్షేత్రాల్లోని శైవాలయాలకు భక్తుల తాకిడి ప్రారంభమైంది. మరో పది రోజుల పాటు శైవక్షేత్రాల్లో రద్దీ కొనసాగనుంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.