Crime News: మరో అమ్మాయిని భర్త ఇంటికి తీసుకొచ్చాడని... భార్య ఆత్మహత్య
- విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో ఘటన
- కాపురాన్ని నాశనం చేసిన వివాహేతర సంబంధం
- భర్త కె.చినరాజు తీరుతో భార్య నాగ వరలక్ష్మి(28) మనస్తాపం
- భర్త తీసుకొచ్చిన అమ్మాయితో గొడవ పడ్డ వరలక్ష్మి
మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదే కాకుండా ఆమెను తన భర్త ఇంటికి తీసుకొచ్చాడన్న మనస్తాపంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కె.చినరాజు, నాగ వరలక్ష్మి(28) భార్యభర్తలు.
వీరికి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగినప్పటికీ సంతానం లేదు. చినరాజు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై అతడితో భార్య వరలక్ష్మి గొడవపడేది. ఈ విషయంలో భర్తతో చాలా సార్లు గొడవపడి పెద్ద మనుషుల ముందు పంచాయతీ కూడా పెట్టించి, వారితో భర్తకు బుద్ధి చెప్పించింది.
అయినప్పటికీ భర్త చినరాజు బుద్ధి మారలేదు సరికదా, వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని అతడు శనివారం తన ఇంటికి తీసుకురావడంతో ఆమెతో వరలక్ష్మి గొడవపడింది. దీంతో వరలక్ష్మి ఇంటికి వచ్చిన ఆ యువతి అదే ఇంటిపైకి ఎక్కి కిందకు దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహేతర సంబంధం కాపురాన్ని నాశనం చేయడమే కాకుండా వరలక్ష్మి ప్రాణం తీసిందని ఆమె బంధువులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.