వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ!
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
- కేవలం 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్
- హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు
- 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బెంగళూరు
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారగా, ఆపై బ్యాటర్లు దుమ్మురేపారు. మొత్తమ్మీద వార్ వన్ సైడ్ చేసేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆర్సీబీ పేసర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 75 పరుగులకే ఆలౌట్ కాగా, ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించి భారీ విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని ఆ జట్టు పేసర్లు నిరూపించారు. జోష్ హేజిల్‌వుడ్ (4/12), భువనేశ్వర్ కుమార్ (3/5) స్వింగ్‌తో ఢిల్లీ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. వీరి ధాటికి పవర్‌ప్లేలోనే ఢిల్లీ వెన్ను విరిగింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభిషేక్ పోరెల్ (30) కాస్త పోరాడటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (19) అతనికి కొద్దిసేపు సహకరించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జాకబ్ బెథెల్ (20) వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (13 బంతుల్లో 34 నాటౌట్), విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 23 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా లాంఛనాన్ని పూర్తి చేశాడు. పడిక్కల్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి మ్యాచ్‌ను వేగంగా ముగించాడు.