కూతురి విషయంలో వెనక్కి తగ్గని యాక్షన్ కింగ్
Add ap7am to your home Screen

కూతురి విషయంలో వెనక్కి తగ్గని యాక్షన్ కింగ్

  • తమిళ .. కన్నడ భాషల్లో నటించిన ఐశ్వర్య 
  •  తెలుగు సినిమాకి సన్నాహాలు 
  • దర్శకుడిగా అర్జున్ మరో ప్రయత్నం    
తెలుగు తెరపై యాక్షన్ కింగ్ గా అర్జున్ కి మంచి క్రేజ్ వుంది. తమిళంలో సీనియర్ స్టార్ హీరోగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అర్జున్ తన కూతురు ఐశ్వర్యను కొంతకాలం క్రితమే కన్నడ .. తమిళ భాషల్లో కథానాయికగా పరిచయం చేశారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, త్వరలో తన కూతురును తెలుగు తెరకి పరిచయం చేస్తానని చెప్పారు. తన దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందని అన్నారు.

 ఇక ఈ విషయంపై అర్జున్ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే .. ఈ రోజున ఐశ్వర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, తన కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందనీ, అందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్టు సమాచారం.
Arjun
Aishwarya
Tollywood

More Telugu News