తిరుమలకు కాలినడకన వచ్చిన శ్రీదేవి కుమార్తెలు!

  • అలిపిరి నుంచి నడక
  • చివరి మెట్టుపై కర్పూరం వెలిగించి మొక్కులు
  • ఈ ఉదయం స్వామి దర్శనం
దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ తమ స్నేహితులతో కలిసి అలిపిరి మార్గంలో నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. వీరు కొండ ఎక్కి వచ్చేసరికి రాత్రి 11 గంటల సమయం అయింది. చివరి మెట్టు వద్ద కర్పూరం వెలిగించి, తిరుమలలోకి ప్రవేశించిన వీరు, శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో బస చేసి, ఈ ఉదయం స్వామిని దర్శించుకున్నారు.

కాగా, నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు స్వామివారిని 88,072 మంది భక్తులు దర్శించుకున్నారు.
Go Back to Shorts
Jhanvi Kapoor
Kushi Kapoor
Tirumala
Tirupati
TTD

More Telugu News