చిరంజీవి తరువాత అల్లు అర్జున్ అంటే ఇష్టం: నటుడు శివాజీ
- 90 సినిమాలకి పైగా చేశాను
- 'మిస్సమ్మ' చెప్పుకోదగిన చిత్రం
- సాయిపల్లవి అంటే అభిమానమన్న శివాజీ
"ఇంతవరకూ 94 .. 95 సినిమాలు చేశాను. నేను అభిమానించే హీరో చిరంజీవి .. ఇప్పటి యువ కథానాయకులలో అల్లు అర్జున్ అంటే ఇష్టం. రజనీకాంత్ తరువాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. నా నాలుకకి పవర్ వుంది .. నేను అన్నది జరుగుతుంది. కథానాయికల విషయానికొస్తే అలనాటి కథానాయికలలో సావిత్రిగారంటే ఇష్టం. ఆ తరువాత సౌందర్య అంటే ఇష్టం. ఈ తరం నాయికలలో సాయిపల్లవిని ఎక్కువగా అభిమానిస్తాను" అని చెప్పుకొచ్చారు.