సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు షాక్.. టెస్టు జట్టులో దక్కని చోటు
Add ap7am to your home Screen

సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు షాక్.. టెస్టు జట్టులో దక్కని చోటు

  • రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
  • నవ్‌దీప్ సైనీ, పృథ్వీషా, శుభ్‌మన్‌లకు స్థానం
  • రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు
భారత క్రికెట్ జట్టులో అనతికాలంలోనే స్టార్ ఓపెనర్‌గా ఎదిగిన కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. కివీస్‌తో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి మొండిచేయి చూపింది. యువ ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించిన సెలక్టర్లు.. యువ పేసర్ నవ్‌దీప్ సైనీకి అవకాశం కల్పించారు.

ఇక ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో గాయపడిన ఇషాంత్‌శర్మకు కూడా జట్టులో చోటు కల్పించినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో స్థానం దక్కుతుంది. మౌంట్ మాంగనుయిలో జరిగిన చివరి టీ20లో గాయపడి వన్డే, టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్న రోహిత్‌శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు స్థానం కల్పించారు.

కివీస్‌తో రెండు టెస్టుల కోసం ప్రకటించిన భారత జట్టు ఇదే: విరాట్ కోహ్లీ (కెప్టెన్) మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శుభ్‌మన్ గిల్, పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికీ), రిషభ్‌పంత్ (వికీ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, ఇషాంత్‌శర్మ (ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి).
KL Rahul
Team India
Rohit Sharma
prithvi shaw

More Telugu News