బర్త్ డే పార్టీ అని చెప్పి 15 మంది చిన్నారులను బంధించిన దుండగుడు... యూపీలో హైడ్రామా

  • ఫరూఖాబాద్ లో ఘటన
  • దుండగుడి చెరలో కొందరు మహిళలు!
  • పోలీసులపై కాల్పులు జరిపిన దుండగుడు
  • ఒకరికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ దుండగుడు 15 మంది చిన్నారులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ అని చెప్పి చిన్నారులను పిలిచి తన ఇంట్లో వారిని నిర్బంధించాడు. అతడి చెరలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టడంతో దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. దాంతో ఏటీఎస్, స్వాట్, క్యూఆర్టీ బలగాలను రప్పించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దుండగుడు మద్యం మత్తులో ఉన్నట్టు అక్కడి వారు చెబుతున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
Farukhabad
Birthday Party
Children

More Telugu News