అమరావతిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు... తీవ్ర ఉద్రిక్తత!
- దొండపాడులో ఘటన
- నిరసనలకు దిగిన వైసీపీ కార్యకర్తలు
- అదనపు బలగాలు మోహరించిన పోలీసులు
వెంటనే వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు, దొండపాడుకు అదనపు బలగాలను తరలించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.