Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరితో కన్నీరు పెట్టిస్తోన్న ఫొటోలు!

  • వీడియో రూపంలో పోస్ట్ చేసిన టర్కీ ఫొటో గ్రాఫర్
  • వైరల్ అవుతోన్న ఫొటోలు
  • పాశ్చాత్య దేశాలు, మిగతా దేశాలకు ఉన్న వ్యత్యాసాలు చెబుతోన్న ఫొటోలు
విషాదకర జీవన పరిస్థితులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేలా ఉన్న కొందరి జీవితాలకు సంబంధించిన ఫొటోలను టర్కీకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ పోస్ట్ చేశారు. అందరితో కన్నీరు పెట్టించేలా ఈ దృశ్యాలు ఉన్నాయి.  అన్ని దేశాలు ఓకే భూ గ్రహంలో ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాలు, మిగతా దేశాలకు ఉన్న వ్యత్యాసాలు ఏంటో తన చిత్రాల ద్వారా వివరించి చెప్పారు.
     ఈ ఫొటోలను డాక్టర్‌ సారా హుమర్‌ తన ట్విటర్‌ ఖాతాలో వీడియో రూపంలో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఎలా ఉన్నారో,  మరికొన్ని పేద దేశాల్లో ప్రజలు ఎలా ఉన్నారో ఈ ఫొటోల ద్వారా వివరించారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు మనుషులను చంపడానికి ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తున్నాయని, వాటివల్ల పలు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Videos
turkey

More Telugu News