కొత్త ఇంట్లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు.. శుక్రవారం హైదరాబాదుకు తిరిగి రాక
- ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఇంటిని నిర్మించుకున్న కేసీఆర్
- పాత నివాసం స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం
- పండితుల సూచన మేరకు కొత్త ఇంట్లో వేడుకలు
ఇంతకు ముందు అక్కడ ఉన్న పాత నివాసాన్ని కూల్చివేసి... అదే ప్రాంతంలో కొత్త ఇంటిని నిర్మించారు. డిసెంబర్ లో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం తర్వాత వచ్చే తొలి పండుగను కొత్త ఇంట్లో జరుపుకోవాలంటూ పండితులు చేసిన సూచన మేరకు... సంక్రాంతి పండుగను కొత్త ఇంట్లో జరుపుకుంటున్నారు.