'అదిరింది' కోసం నాగబాబు అలా ప్లాన్ చేశాడట
Add ap7am to your home Screen

'అదిరింది' కోసం నాగబాబు అలా ప్లాన్ చేశాడట

  • 'అదిరింది' కామెడీ షో పైనే నాగబాబు దృష్టి 
  • రేటింగ్ పెంచేందుకు ప్రయత్నాలు 
  • రంగంలోకి 'పటాస్' జోడీ   
పాప్యులర్ షో 'జబర్దస్త్'కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన నాగబాబు, కొన్ని కారణాల వలన బయటికి వెళ్లారు. వేరే చానల్ వారు నిర్వహిస్తున్న 'అదిరింది' కార్యక్రమానికి ఆయన న్యాయనిర్ణేతగా వున్నారు. 'అదిరింది' కామెడీ షోకి నాగబాబు న్యాయనిర్ణేతగా ఉన్నప్పటికీ, రేటింగ్ విషయంలో ఈ కార్యక్రమం 'జబర్దస్త్'ను బీట్ చేయలేకపోతోంది.

న్యాయనిర్ణేత స్థానంలో నాగబాబు .. వేదికపై 'జబర్దస్త్' నుంచి వచ్చిన కమెడియన్లు ఉండటంతో, 'అదిరింది'లో కొత్తదనం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాంతో కొత్తదనం కోసం కొత్త టీమ్ లను రంగంలోకి దింపాలని భావించిన నాగబాబు, 'పటాస్'తో క్రేజ్ తెచ్చుకున్న 'సద్దాం'ను .. యాదమ్మరాజును తీసుకోమని నిర్వాహకులకు సూచించాడట. ఫలితంగా ఈ ఆదివారం నుంచి వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటికి వచ్చేసింది. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
Nagababu

More Telugu News