టీవీ చానెల్ లైవ్ లో ప్రేయసిని హత్య చేసినట్టు వెల్లడి... వెంటనే వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు!
- 2010లో ప్రియురాలి హత్య
- కొత్త సంవత్సరం వేడుకల కోసం పిలిచి దారుణం
- మరో హత్య కూడా చేశాడంటున్న పోలీసులు
2010లో తన ప్రియురాలు సరబ్జిత్ కౌర్ ను హత్య చేసినట్టు ఈ కార్యక్రమంలో అంగీకరించాడు. తన బావతో ఆమె సంబంధం పెట్టుకున్నందునే అలా చేయాల్సి వచ్చిందని అన్నాడు. న్యూ ఇయర్ డే వేడుకల కోసం పిలిపించి, ఓ హోటల్ లో హత్య చేశానని చెప్పాడు.
ఇక ఈ షో గురించి, మహీందర్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకుని, వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు, అతన్ని లైవ్ కార్యక్రమం జరుగుతుండగానే అరెస్ట్ చేశారు. కాగా, నిందితునిపై మరో హత్య కేసు కూడా ఉందని, దానిపై కొంత కాలం శిక్షను అనుభవించి, బెయిల్ పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు.