జడ్జి అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఆందోళన లేకుండా సమాధానాలు చెప్పిన హాజీపూర్ నిందితుడు

  • హాజీపూర్ కిల్లర్ కేసు విచారణ
  • జనవరి 3కి వాయిదా
  • సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలు
కొన్నినెలల కిందట తెలంగాణలోని హాజీపూర్ లో వెలుగుచూసిన అమ్మాయిల మృతదేహాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ కిరాతకాలకు కారకుడు శ్రీనివాస్ రెడ్డి అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి ఆందోళన లేకుండా విచారణను తప్పుదోవ పట్టించే రీతిలో జవాబులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు సంబంధం ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 'ఎవరా సువర్ణ.. నాకు తెలియదు' అంటూ దిగ్భ్రాంతికర రీతిలో సమాధానమిచ్చాడు.

ఇక, హతులైన బాలికల దుస్తులపై ఉన్న వీర్యపు మరకలు, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది, దీనిపై నువ్వేమంటావు? అని ప్రశ్నించగా, పోలీసులు వాటిని బాలికల దుస్తులపై చల్లారంటూ జంకుగొంకు లేకుండా జవాబిచ్చినట్టు తెలిసింది. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తావా? అంటే, తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని చెప్పాడు. కాగా, పోక్సో న్యాయస్థానంలో జరుగుతున్న ఈ కేసు విచారణ జనవరి 3వ తేదీకి వాయిదాపడింది.
Go Back to Shorts
Hazipur
Telangana
Srinivas Reddy
Police
Court

More Telugu News