హైదరాబాద్ లో కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు
- ఈ నెల 28న ర్యాలీ తలపెట్టిన కాంగ్రెస్
- అనుమతి కోసం డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
- సభ మాత్రం నిర్వహించుకోవచ్చన్న డీజీపీ
రోడ్లపై నిరసనల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది: సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ లో రోడ్లపై ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని అన్నారు. హైదరాబాద్ లో ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ, ఆయా పార్టీల కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించుకోవాలని చెప్పారు.