‘ఈ రకంగా ఏడిపిస్తున్నాడు.. కంటికి నిద్ర పడితే ఒట్టు’: 'అమరావతి' దీక్షలో ఓ రైతు భార్య ఆవేదన

20-12-2019 Fri 16:15 | Andhra
  • మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు రైతులము
  • అమరావతి ఒక సామాజికవర్గం కోసమే అనడం తప్పు
  • మూడు రాజధానులు వద్దంటూ నిరసన
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు, తోటి రైతులు నిలిచారు. ఈ సందర్భంగా ఓ రైతు భార్య మాట్లాడుతూ, ఓ మంత్రి తమను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ విమర్శలు చేశారని, ఆ వ్యాఖ్యలు కరెక్టు కాదని ధ్వజమెత్తారు. తాము పెయిడ్ ఆర్టిస్టులం కాదు.. రైతులము అని, తమ ఆధార్ కార్డులు కూడా చూపించామని అన్నారు.

ఇప్పుడు మా పొలాలను తిరిగి ఇచ్చేస్తామంటే ఏం చేసుకుంటాం

ప్రభుత్వం ఇప్పుడు మా పొలాలను తిరిగి మాకు ఇచ్చేస్తామంటే ఏం చేసుకుంటామని మరో రైతు భార్య మండిపడ్డారు. తమ పిల్లల భవిష్యత్, ముందు తరాల భవిష్యత్ బాగుంటుందనేగా నాడు తమ పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిందని అన్నారు. ‘ఈ రకంగా ఏడిపిస్తున్నాడు.. కంటికి నిద్ర పడితే ఒట్టు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతం ఒక సామాజికవర్గం ప్రయోజనానికే ఉందన్న ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. ‘మా అందరినీ కూడా ఎస్సీ, ఎస్టీలను చేయండి.. అంతకంటే చెప్పలేను’ అంటూ ఆమె విలపించారు.
Andhra PradeshamaravathiFarmers

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more