ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో టీమిండియా రన్ మెషీన్ కోహ్లీ..టాప్-100లో ప్రభాస్, మహేశ్‌బాబు!

20-12-2019 Fri 09:19 | National
  • ఈ ఏడాది అత్యధిక ఆదాయం, కీర్తి కలిగిన ప్రముఖుల జాబితా విడుదల
  • రెండు, మూడు స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్
  • 44వ స్థానంలో ప్రభాస్.. 54వ స్థానంలో మహేశ్ బాబు
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతులు ఆధారంగా వందమంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. కోహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌లు ఉన్నారు. టాలీవుడ్ నటులు ప్రభాస్, మహేశ్‌బాబులు వరుసగా 44, 54వ స్థానాల్లో నిలిచారు. గతేడాది అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వారు ఆర్జించిన సంపాదన ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

విరాట్ కోహ్లీ రూ.252.72 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండగా, రూ.293.25 కోట్లతో అక్షయ్ కుమార్, రూ.229.25 కోట్లతో సల్మాన్ ఖాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమితాబ్ బచ్చన్ (రూ.135.93 కోట్లు), షారూక్ ఖాన్ (రూ.124.38), రణ్‌వీర్ సింగ్ (118.2 కోట్లు), నటి ఆలియా భట్ (రూ.59.21 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.76.96 కోట్లు), దీపిక పదుకొనె (రూ.48 కోట్టు)లు టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.

ఇక, దక్షిణాదికి చెందిన ప్రముఖుల్లో.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంద కోట్ల రూపాయల ఆదాయంతో 13వ స్థానంలో నిలవగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 94.8 కోట్ల ఆదాయంతో 16వ స్థానంలో నిలిచాడు. రూ.35 కోట్లతో ప్రభాస్ 44వ స్థానంలో, 35 కోట్లతో మహేశ్ బాబు 54వ స్థానంలో ఉన్నారు. దర్శకుడు శంకర్ 31.5 కోట్లతో 55వ స్థానంలోను, కమల హాసన్ రూ.34 కోట్లతో 56వ స్థానంలో ఉన్నారు. రూ. 21.05 కోట్లతో  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 63వ స్థానంలో, అంతే మొత్తంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ 72వ స్థానంలో, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రూ. 3 కోట్లతో 81వ స్థానంలో, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ రూ.2.63 కోట్ల సంపాదనతో 88వ స్థానంలో నిలిచారు.

నిర్ణయించే విధానం:
ఒక ఏడాదిలో ఆయా వ్యక్తుల మొత్తం ఆదాయం, వారు ప్రింట్, సోషల్ మీడియా ద్వారా గడించిన పేరు ప్రఖ్యాతులు కలిపి ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే, కొందరి ఆదాయం ఎక్కువున్నా, కీర్తి పరంగా ర్యాంక్ దిగువకు వస్తుంది. కొందరి ఆదాయం తక్కువున్నా, సంపాదించిన కీర్తి కారణంగా ర్యాంక్ పెరుగుతుంది.
కంప్లీట్ లిస్ట్ కొరకు క్లిక్ చేయండి 
forbesVirat KohliprabhasMahesh Babu

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more