హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం!

18-12-2019 Wed 08:19 | Telangana
  • ఈ నెల 13న ఘటన 
  • బాలిక ఆడుకుంటుండగా తీసుకెళ్లి అత్యాచారం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ, బండ్లగూడకు చెందిన ఓ వ్యక్తి అలీనగర్‌లోని రంగుల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 13న పరిశ్రమకు వెళ్తూ తన 11 ఏళ్ల కుమార్తెను వెంట తీసుకెళ్లాడు. అతడు డ్యూటీలో నిమగ్నమవగా, బాలిక ఆడుకుంటోంది.

చిన్నారి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు ఆమెను సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలిక మూడు రోజుల వరకు ఈ దారుణాన్ని బయటకు చెప్పలేకపోయింది. చివరికి గతరాత్రి జరిగిన విషయాన్ని తండ్రికి ఏడుస్తూ చెప్పడంతో షాకైన అతడు వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన ప్రదేశం మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మైలార్‌దేవుపల్లి స్టేషన్‌కు పంపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabadgirlrape

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more