విద్యార్థి లోకంపై పోలీసు చర్య నన్ను కలచివేసింది: మోహన్ బాబు
- పౌరసత్వం చట్టం కారణంగా నిరసన జ్వాలలు
- ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య
- ఖండించిన మోహన్ బాబు
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడికి దిగడం తనను కలచివేసిందని తెలిపారు. తాను హింసను ప్రోత్సహించనని, ఏ విధమైన హింసకు పాల్పడవద్దని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, పోలీసులకు కూడా ఈ సందర్భంగా సూచన చేశారు. 'మైడియర్ పోలీస్, విద్యార్థులే మన దేశ భవిష్యత్తు, వారిని గౌరవించండి' అంటూ పేర్కొన్నారు.