నీటిలో గద్దను పట్టేసిన ఆక్టోపస్.. విపరీతంగా వైరల్ అవుతోన్న వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీటిలో గద్దను పట్టేసిన ఆక్టోపస్.. విపరీతంగా వైరల్ అవుతోన్న వీడియో

  • కెనెడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో ఘటన
  • వీడియో తీసిన మత్య్యకారులు
  • గద్దను రక్షించిన ఓ వ్యక్తి
  • గాల్లోకి ఎగిరిపోయిన గద్ద
కెనెడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో ఆహారం కోసం నీటిలో అన్వేషిస్తోన్న ఓ గద్దను  ఆక్టోపస్‌ పట్టేసింది. దానికి చిక్కిన గద్ద విలవిల్లాడిపోయింది.. విడిపించుకోలేపోయింది. బాధతో అది చేస్తోన్న చప్పుడును విన్న ఓ వ్యక్తి ఆక్టోపస్‌ బారి నుంచి గద్దను రక్షించాడు. ఒక కర్ర సాయంతో ఆక్టోపస్‌ను కదిలించి, గద్దను దాని నుంచి వదిలించే ప్రయత్నం చేశాడు. చివరకు గద్దను ఆక్టోపస్‌  విడిచింది.

దీంతో గద్ద గాల్లోకి ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలను మత్స్యకారులు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియోను రెండున్నర మిలియన్ల మంది చూశారు. గద్దను  కాపాడిన వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Viral Videos
Canada

More Telugu News