ఈ ఏడు మరింతగా తగ్గనున్న భారత వృద్ధి రేటు: హెచ్చరించిన ఏడీబీ
- 2019-20లో 5.1 శాతమే
- ఆ తరువాతి సంవత్సరంలో 6 శాతం వరకూ
- తాజా అంచనాలు వెల్లడించిన ఏడీబీ
వాస్తవానికి 2019లో ఏడీబీ అంచనాలు వేసిన సమయంలో భారత వృద్ధి 7 శాతం వరకూ ఉంటుందని వెల్లడైంది. అయితే, ఆర్థిక మాంద్యం, మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత 6 శాతానికి, ఆపై దాన్ని తాజాగా 5.1 శాతానికి కుదించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో తొలుత అంచనా వృద్ధి రేటు 7 శాతం కాగా, దాన్ని 6 శాతానికి తగ్గించడం గమనార్హం.