ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మన్సురాబాద్ కాలనీ వాసులు.. ఉద్రిక్తత
- రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్
- తమకు కేటాయించకుండా స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపణ
- ఆందోళనకారుల అరెస్టు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లను తమకు కేటాయించకుండా పలువురు స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని మన్సురాబాద్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి 150 కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు.