సైనికుల జీవితాలపై ఎంఎస్ ధోనీ టీవీ షో!
- సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ
- సైనికులంటే అపార గౌరవం
- త్వరలోనే షో ప్రసారం
ఈ షో ద్వారా సైనికుల త్యాగాలు, దేశ భద్రత కోసం వారి శ్రమ ప్రజలందరికీ తెలియాలన్నదే ధోనీ ఉద్దేశం. సైనికులు, వారి కుటుంబ సభ్యుల వాస్తవిక జీవితాలు ఎలా ఉంటాయన్నది కూడా ధోనీ తన టీవీ షో ద్వారా వివరించనున్నాడు. ఓ జాతీయ స్థాయి చానల్ (స్టార్ ప్లస్ లేదా సోనీ టీవీ) లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.