రాత్రి 10 దాటితే అమ్మాయిలను ఉచితంగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తోన్న పోలీసులు
- కర్ణాటకలోని గదగ్ లో పోలీసుల సేవలు
- ఫోన్ చేస్తే వచ్చి డ్రాప్ చేస్తామంటోన్న పోలీసులు
- మహిళలపై దాడుల నేపథ్యంలో నిర్ణయం
'మహిళలు ఏ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినా లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసినా ఈ సేవలు అందుతాయి. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి వారి వాహనంలో మహిళలను ఇంటి వద్ద ఉచితంగా డ్రాప్ చేస్తారు' అని గదగ్ ఎస్పీ శ్రీనాథ్ జోషి ఈ రోజు మీడియాకు తెలిపారు. నిన్న సాయంత్రం పలు ప్రాంతాలను వారు పరిశీలించి, మహిళల భద్రత విషయాన్ని పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుకోవచ్చని చెప్పారు.