నౌ రెస్ట్ ఇన్ పీస్ దిశ!: ఎన్టీఆర్
Add ap7am to your home Screen

నౌ రెస్ట్ ఇన్ పీస్ దిశ!: ఎన్టీఆర్

  • ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది
  • ట్విట్టర్ లో కామెంట్ పెట్టిన ఎన్టీఆర్
  • ఎన్ కౌంటర్ పై పలువురు ప్రముఖుల హర్షం
దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారుజామున తమ కస్టడీలో ఉన్న నిందితులను ఘటనా స్థలికి పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో వారు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నిందితులంతా హతులైన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Disha
NTR
Twitter

More Telugu News