శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అదే తుది తీర్పు కాదు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళలందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ గతేడాది తీర్పు
- తీర్పును గుర్తు చేసిన ఇందిరా జైసింగ్
- కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామన్న సుప్రీంకోర్టు
శబరిమలతోపాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గతేడాది తీర్పుపై ఎటువంటి స్టే ఇవ్వలేదన్న ఇందిరా జైసింగ్ వాదనలను అంగీకరించిన జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. గతంలో దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.