'వెంకీమామ' విడుదల తేదీ ఖరారైపోయినట్టే
Add ap7am to your home Screen

'వెంకీమామ' విడుదల తేదీ ఖరారైపోయినట్టే

  • వినోదభరిత చిత్రంగా 'వెంకీమామ'
  • వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా 
  • 'క్రిస్మస్' కానుకగా విడుదల  
వెంకటేశ్ - చైతూ ప్రధాన పాత్రధారులుగా 'వెంకీమామ' నిర్మితమైంది. బాబీ రూపొందించిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా కనిపించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని భావించారు. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో, డిసెంబర్ 13వ తేదీనగానీ .. 20వ తేదీనగాని విడుదల చేయాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ 'క్రిస్మస్' పర్వదినం సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రోజున బుధవారం అయినప్పటికీ ఈ సినిమాను విడుదల చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ తేదీ దాదాపు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ - తమన్ ఇద్దరూ ఈ సినిమాకి పనిచేయడం, అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Venkaatesh
Payal
Naga Chaitanya
Rasi Khanna

More Telugu News