సినీ ప్రముఖులపై ఐటీ దాడుల నేపథ్యంలో హీరో నవదీప్ కామెంట్
Add ap7am to your home Screen

సినీ ప్రముఖులపై ఐటీ దాడుల నేపథ్యంలో హీరో నవదీప్ కామెంట్

  • దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, నానిలపై ఐటీ దాడులు
  • ఫన్నీ ట్వీట్ చేసిన నవదీప్
  • నాపై దాడులు చేసి ఉంటే.. వారే నా వద్ద కొంత డబ్బు వదిలేసి వెళ్లేవారు
టాలీవుడ్ సినీ హీరోలు, నిర్మాతలపై హైదరాబాదులో నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలుత నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు నివాసం, కార్యాలయాలపై దాడులు చేసిన అధికారులు... ఆ తర్వాత వెంకటేశ్, నానిల కార్యాలయాలు, ఇళ్లపై కూడా రెయిడ్స్ చేశారు. ఈ దాడులతో టాలీవుడ్ ఒక్కసారిగా కంగారు పడింది.

మరోవైపు, ఈ దాడులపై హీరో నవదీప్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'ఒకవేళ ఐటీ అధికారులు నా మీద దాడులు చేసి ఉంటే... కొంత డబ్బును వారే నావద్ద వదిలేసి వెళ్లేవారు' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. దీనికి తోడు 'బిల్ బ్యాండ్ బాజా' అనే ట్యాగ్ ను కూడా జత చేశాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురంలో' చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

Navadeep
Tollywood
IT Raids

More Telugu News