పునర్నవి ప్రత్యేకత అదే: దర్శకుడు విరించి వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పునర్నవి ప్రత్యేకత అదే: దర్శకుడు విరించి వర్మ

  • పునర్నవి మంచి నటి
  • సహజంగా నటిస్తుంది 
  • డబ్బింగ్ బాగా చెప్తుందన్న విరించి వర్మ
'బిగ్ బాస్ 3' రియాలిటీ షోకి పునర్నవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ షో నుంచి ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పునర్నవి పాల్గొనగా, ఆమె తొలి సినిమా 'ఉయ్యాలా జంపాలా' దర్శకుడైన 'విరించి వర్మ' ఆమెను గురించి మాట్లాడారు.

'ఉయ్యాలా జంపాలా' ఆడిషన్స్ కోసం వచ్చినప్పుడు పునర్నవిని మొదటిసారిగా చూశాను. ఒక సీన్ పేపర్ ఇచ్చి డైలాగ్స్ చెప్పమంటే, చాలా నేచురల్ గా చెప్పేసింది. ఈ అమ్మాయి ఈ పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందనీ, మంచి భవిష్యత్తు ఉంటుందని అప్పుడే అనుకున్నాను. సినిమా విడుదల తరువాత చాలా మంది కాల్ చేసి పునర్నవి గురించి అడిగారు. ఆడిషన్స్ లో కంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు బాగా చేస్తుంది. అలాగే డబ్బింగ్ కూడా తను చాలా బాగా చెబుతుంది. ఇలా తన పాత్రకు తనే మెరుగులు దిద్దుకుంటూ వస్తుంది .. అదే ఆమె ప్రత్యేకత" అని చెప్పుకొచ్చాడు.
Punarnavi
Rahul

More Telugu News