నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిన విషయం నాకు చెప్పలేదు: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిన విషయం నాకు చెప్పలేదు: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్

  • నేను 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లాను
  • మూడో రోజున నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది 
  • మా కుటుంబ సభ్యులు బాధను దిగమింగుకున్నారు 
తెలంగాణ యాసలో జానపద గీతాలు పాడటంలో రాహుల్ సిప్లిగంజ్ కి మంచి ప్రావీణ్యం వుంది. ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా యూత్ ను ఆకట్టుకున్నాయి. అలాంటి రాహుల్ 'బిగ్ బాస్ 3' విజేతగా నిలిచి, మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "నేను 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లిన మూడో రోజున మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందట. దాంతో మా బంధువులు .. స్నేహితులు నాకు ఈ విషయాన్ని తెలియపరచాలని అనుకున్నారట. అయితే మా కుటుంబ సభ్యులు మాత్రం, నాకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేనని తెలియనివ్వలేదు. ఆ విషయం నేను గేమ్స్ ఆడే తీరుపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో నాకు చెప్పలేదు. బయటికి వచ్చిన తరువాతనే నాకు చెప్పారు. నా కోసం నా తల్లిదండ్రులు ఆ బాధను దిగమింగుకున్నారు. అలాంటి తల్లిదండ్రులకు కొడుకునైనందుకు సంతోషిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Rahul
Punarnavi

More Telugu News