నేను సక్సెస్ కాలేదని అనుకోవడం లేదు: పునర్నవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సక్సెస్ కాలేదని అనుకోవడం లేదు: పునర్నవి

  • నాది ఇంకా చిన్నవయసే 
  • చదువు కారణంగా పూర్తి దృష్టి పెట్టలేకపోయాను
  • మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నానన్న పునర్నవి 
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన పునర్నవి, 'బిగ్ బాస్ 3' ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు నటనపట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి కారణంగానే నేను సినిమాల వైపు అడుగువేశాను.

'ఉయ్యాలా జంపాలా' వంటి హిట్ మూవీ చేసిన తరువాత కూడా నా కెరియర్ స్పీడ్ అందుకోలేదనీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయానని అంటున్నారు. కానీ ఆ సినిమా చేసేటప్పటికి నా వయసు కేవలం 17 సంవత్సరాలే. అందువలన ఒక వైపున నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ, మరో వైపున చదువును కొనసాగిస్తూ ఉండటం వలన పూర్తి దృష్టి పెట్టలేకపోయాను. ఇంకా నేను చిన్నదానినే కావడం వలన, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను. ఆశించినస్థాయిని అందుకుంటానని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చింది.
Punarnavi
Rahul

More Telugu News