శాంతించని ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు... పార్లమెంటు ముట్టడికి యత్నం
- జేఎన్ యూలో హాస్టల్ ఫీజు పెంపు
- ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు
- కీలక మెట్రో స్టేషన్ల మూసివేత
తాజాగా, 2 వేల మంది విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీలోని కీలక మెట్రో రైల్వే స్టేషన్లలో కార్యకలాపాలు నిలిపివేశారు. రోడ్లపైకి వచ్చిన వేలాది మంది విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో మెట్రో రైల్ విభాగం ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, లోక్ కల్యాణ్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లను మూసివేసింది.