అయ్యప్ప భక్తుల వెనకే శునకం.. ఇప్పటికే వందల కి.మీ దూరం వెళ్లిన వైనం
- తిరుమల నుంచి శబరిమలకు బయలుదేరిన కొందరు అయ్యప్ప భక్తులు
- గత నెల 31 నుంచి శబరిమలకు కాలినడకన యాత్ర ప్రారంభం
- వారి వెంట 480 కిలోమీటర్లు నడిచిన శునకం
తన వెంటే ఆ శునకం 480 కిలోమీటర్లు వచ్చిందని, దీంతో దానికి కూడా ఆహారాన్ని పెడుతున్నామని అయ్యప్ప భక్తులు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. తాము ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన వెళ్తామని, ఇలా శునకం తమ వెంటే రావడం ఇదే తొలిసారని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది.