నాగ్ చేతుల మీదుగా రానున్న సుమంత్ మూవీ టైటిల్ పోస్టర్
- సుమంత్ హీరోగా కొత్త చిత్రం
- దర్శకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి
- త్వరలో పూర్తి వివరాలు
ధనుంజయన్ నిర్మాతగా ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగార్జున విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు.