సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గతాన్ని పక్కన పెట్టేసిందట!
  • 'రెడ్' షూటింగులో జాయిన్ అయిన రామ్ 
  • డబ్బింగ్ మొదలెట్టిన సూపర్ స్టార్  
   *  ప్రస్తుతం తాను తన పని మీదే దృష్టి పెట్టానని అంటోంది కథానాయిక ఇలియానా. బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయాక సినిమాలపైనే మొత్తం దృష్టి పెట్టానని, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పింది. అతనితో గడిపిన తన గతాన్ని పక్కన పెట్టేశానని తెలిపింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హిందీలో 'పాగల్ పంటి' అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం తను ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వుంది.  
*  'ఇస్మార్ట్ శంకర్' తర్వాత హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. 'రెడ్' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం షూటింగులో రామ్ నిన్న జాయిన్ అయ్యాడు. ఇందులో తను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
*  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'దర్బార్' చిత్రం డబ్బింగ్ మొదలైంది. ప్రస్తుతం రజనీకాంత్ తన పార్ట్ కు డబ్బింగ్ చెబుతున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో విడుదల చేస్తారు.  
Ileana
Ram
Rajanikanth
Nayanatara

More Telugu News