లిస్ట్ వదలమంటారా?: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్
- కడుపు మండి ప్రజలు మాట్లాడుతుంటే.. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటారా?
- పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టిందే మీ జగన్
- మీ పెయిడ్ ఆర్టిస్టులకు జీతాలిచ్చి జనాల మీదకు వదిలారు
మీ ముఖ్యమంత్రి జగన్ చెత్త నిర్ణయాలతో కడుపు మండి ప్రజలు మాట్లాడుతుంటే... వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానిస్తారా? అని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టిందే మీ జగన్ అని ఎద్దేవా చేశారు. మీ పెయిడ్ ఆర్టిస్టులకు జీతాలిచ్చి మరీ ప్రజల మీదకు వదిలారని... వారందరికీ ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని విమర్శించారు. లిస్ట్ వదలమంటారా? ఆర్టిస్టుల బాగోతం ఏంటో తేల్చుకుందామా? అని సవాల్ విసిరారు.