'పెంగ్విన్' షూటింగును పూర్తిచేసిన కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

'పెంగ్విన్' షూటింగును పూర్తిచేసిన కీర్తి సురేశ్

  • విభిన్నమైన కథాంశంతో 'పెంగ్విన్'
  • నిర్మాతగా మారిన కార్తీక్ సుబ్బరాజ్ 
  • గర్భవతిగా కనిపించనున్న కీర్తి సురేశ్
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే తమిళంలో ఆమె చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వస్తున్నాయి. 'మహానటి' హిట్ తరువాత నాయిక ప్రాధాన్యతగల కథలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చిన కీర్తి సురేశ్, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మూడు చేస్తోంది. వాటిలో రెండు తెలుగు సినిమాలు కాగా, ఒకటి తమిళంలో 'పెంగ్విన్'.

కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో .. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గర్భవతిగా కనిపించనుండటం మరో విశేషం. కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ తరహా పాత్రలు చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయంటూ కీర్తి సురేశ్ చెప్పడం, ఆమె అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Keerthi Suresh

More Telugu News