' రాగల 24 గంటల్లో' విడుదల తేదీ ఖరారు
- సస్పెన్స్ థ్రిల్లర్ గా 'రాగల 24 గంటల్లో'
- ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఈషా రెబ్బా
- ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఇంట్రెస్టింగ్ టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, టీజర్ తో మరింతగా అంచనాలు పెంచింది. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి ప్రాధాన్యత ఎక్కువని తెలుస్తోంది. గ్లామర్ పరంగా .. నటనపరంగా ఈషాకి వంకబెట్టవలసిన పనిలేదు. అలాంటి ఈషా రెబ్బా కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.