Kesineni Nani: జగన్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు: కేశినేని నాని

  • ఏపీ రాజధానిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు
  • టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు
  • మేము కేసులకు భయపడబోం 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాగా, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని, తాము కేసులకు భయపడబోమని కేశినేని నాని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాము పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు.

More Telugu News

Kesineni Nani
Telugudesam
Jagan