చంపేస్తానంటూ ప్రియురాలి మెడపై కత్తి... ఉన్మాదికి స్థానికుల దేహశుద్ధి!
- తమిళనాడులో ఘటన
- నడిరోడ్డుపై యువతితో వాగ్వాదం
- ప్రేమించకుంటే హత్య చేస్తానని బెదిరింపు
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న శివకుమార్, ఆమె ఎప్పుడు దొరుకుతుందా? అని మాటేశాడు. నిన్న ఉదయం పన్నారీ రోడ్డులో బస్ కోసం వేచి చూస్తున్న యువతి వద్దకు వచ్చిన శివకుమార్, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. ఆమె ససేమిరా అనడంతో, తనతో తెచ్చుకున్న కత్తి తీసి, ఆమె గొంతుపై పెట్టాడు. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ ఉన్మాదాన్ని చూసిన చుట్టు పక్కల వారు ధైర్యం చేసి, శివకుమార్ ను బంధించి, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.