రాంచీలో నిప్పులు చెరుగుతున్న షమీ... ఫాలో ఆన్ లో 4 వికెట్లు కోల్పోయిన సఫారీలు
- మరో విజయం ముంగిట టీమిండియా
- ఫాలో ఆన్ లో పడిన సఫారీలు
- షమీకి 3 వికెట్లు
కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకు ఆలౌట్ కావడం ద్వారా 335 పరుగులు వెనుకబడ్డారు. తొలుత ఉమేశ్ యాదవ్ సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ డికాక్ (5)ను అవుట్ చేయగా, ఆ తర్వాత షమీ శివాలెత్తినట్టు బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 4 వికెట్లకు 26 పరుగులు మాత్రమే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గార్ (16), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (0) ఆడుతున్నారు.