'వెంకీమామ' రిలీజ్ డేట్ పై డౌట్!
- బాబీ దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
నిజానికి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉందట. ఆల్రెడీ పూర్తయి వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ సురేశ్ బాబుకి నచ్చకపోవడం వలన, పర్ఫెక్ట్ గా చేసి పంపించమని చెప్పేసి వెనక్కి పంపించేశారట. రెండు రోజుల్లో ఆ అవుట్ పుట్ రానుంది .. అది సురేశ్ బాబుకి నచ్చితే, దానిని బట్టి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.